
శబరిమల ఆలయంలో స్వర్ణ పూత (Gold Plating) వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దాతగా పేరు గాంచిన ఉన్నికృష్ణన్ పోట్టి ఆర్థిక లావాదేవీలపై ఇంటెలిజెన్స్ విభాగం, దేవస్వం విజిలెన్స్ అధికారులు కఠిన విచారణ ప్రారంభించారు.
విజిలెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, పోట్టి గత కొన్నేళ్లలో భారీ ఎత్తున భూములు, ఆస్తుల లావాదేవీలు జరిపారు. బ్లేడ్ వడ్డీ (అధిక వడ్డీ రుణాలు) ఇచ్చి తిరిగి చెల్లింపులు సాధ్యంకాకపోతే ఆస్తులను తన పేరు లేదా కుటుంబ సభ్యుల పేర్లలో రిజిస్టర్ చేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం మూడు సంవత్సరాల్లోనే దాదాపు ₹30 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.
గోల్డ్ షీట్స్ లో గ్యాప్:
2019 జూలై 20న ఆలయంలోని స్వర్ణ పూత షీట్స్ తొలగించబడ్డాయి. కానీ అవి చెన్నైలోని Smart Creations సంస్థకు చేరడానికి దాదాపు 40 రోజులు ఆలస్యం జరిగింది. ఆ సమయంలో షీట్స్ ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు.
అదనంగా, షీట్స్ తిరిగి వచ్చినప్పుడు వాటి బరువు నాలుగు కిలోల మేర తగ్గిందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక నమోదు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
దర్యాప్తు ప్రధానాంశాలు:
1.స్వర్ణ షీట్స్ ఆలస్యంగా చేరడానికి కారణం ఏమిటి?
2.మధ్యలో అవి ఎక్కడ ఉంచబడ్డాయి?
3.నాలుగు కిలోలు తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
4.పోట్టి లావాదేవీలకు మూలధనం ఎక్కడి నుండి వచ్చింది?
5.దేవస్వం విజిలెన్స్ అధికారులు ఈ అంశాలపై ఉన్నికృష్ణన్ పోట్టిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.
శబరిమల ఆలయాన్ని వేదికగా చేసుకుని పెద్ద ఎత్తున నిధుల సేకరణ జరిగి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.
మూలం: Sabarimala Uptodate 17